ఈతరం భారతం యాదాద్రి భువనగిరి: జూలై 13
జిల్లా పరిధిలోని ఆలేరు మండలం గొలనుకొండకు చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్ లగ్గాని బాలరాజు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయుల సత్కారం ఘనంగా జరిగింది. మాజీ ఎంపీటీసీ బింగి రవి తదితరులు బాలరాజు, తారమ్మ దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా విద్యుత్ ఉద్యోగిగా బాలరాజు ప్రజలకు అందించిన సేవలను వారు కొనియాడారు.















