
ఉచిత ఇసుక ఎలా..!!!!!
09.07.2024
ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ.
ఈ వెబ్సైట్ లో www.mines.ap.gov.in మీకు దగ్గరలో శాండ్ డిపో ఎక్కడ ఉంది. ఆ డిపోలో ఇసుక స్టాక్ ఎంత ఉంది. ఆరోజు ఎంతమందికి శాండ్ ఇచ్చారు. తర్వాతి రోజుకి ఇంకా ఇసుక స్టాక్ ఎంత మిగిలింది అనే వివరాలను ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అధికారులు అప్డేట్ చేస్తారు. ఈ వివరాలు తెలుసుకొని తర్వాతి రోజు ప్రజలు శాండ్ డిపో వద్దకు వెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చును.
ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి. ఒకరికి రోజుకి 20 టన్నుల ఇసుక మించి ఇవ్వరు. గమనించగలరు. ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి మీ ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్ మరియు వాహనం నంబర్ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన తక్కువ లోడింగ్, ట్రాన్స్పోర్ట్ క్ ఫీజును మాత్రమే ఆన్లైన్ లో చెల్లించాలి. ఇందుకోసం అక్కడ QR కోడ్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్షంగా డబ్బులు ఎవరికీ ఇవ్వాల్సిన పని ఉండదు. ఇందులో ప్రభుత్వ వసూలు చేయబడే రాబడి ఉండదు. స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇసుకను లోడ్ చేస్తారు.














