ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 8
———————————————–
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 34 నెలల్లో రూ.79 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని, రూ.1,900 కోట్ల వడ్డీ చెల్లించామని వెల్లడించారు. ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఏమిచ్చిందో.. మూడేళ్ల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందో చర్చ పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా శక్తే ప్రభుత్వ శక్తి.. ఆడబిడ్డల ఆశీర్వాదమే తనకు అండ అని.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్లో రెండోరోజు పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లగచర్లలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను ఆడబిడ్డల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 4.5 లక్షల చేయూత కొత్త పెన్షన్లను పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ఇప్పటికే 79 వేల కోట్ల రుణాలిచ్చామన్నారు. మహిళారుణాలకు 1900 కోట్ల వడ్డీ చెల్లించామని తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు













