చంద్రబాబు నాయుడిని కలిసి అభినందనలు తెలిపిన తాడేల సరస్వతి
హైదరాబాద్ జూలై 9 (ఈతరం భారతం );తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రి పదవి భాద్యతలు చేపట్టి తెలంగాణా రాష్ట్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్బంగా ఆపార్టీ సీనియర్ నాయకురాలు తాడేల సరస్వతి ఎన్టిఆర్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు సరస్వతినిఅభినందించారు. ఈ సందర్బంగా సరస్వతి మాట్లాడుతూ నాల్గవసారి ముఖ్యమంత్రి పదవి భాద్యతలు చేపట్టి తెలంగాణా రాష్ట్రానికి రావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు.తెలంగాణా రాష్ట్రం లో తిరిగి తెలుగు దేశం పార్టికి పూర్వ వైభవం తీసుక రావాలని సరస్వతి ఆకాంక్షించారు.














