అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి
09.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి మధుశ్రీ నలుబోల,ఖమ్మం.
తిరుమలాయపాలెం:అర్హులైన ఈదలందరికీ ఎల్లో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ధరణిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టా పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ తాసిల్దార్ పివి రామకృష్ణ కి సిపిఎం మండల కమిటీ వినతి పత్రం అందజేశారు తిరుమలాయపాలెం మండలంలో అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలని పట్టా పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టా పుస్తకాలు ఇవ్వాలని సాదా బైనామాలు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టా బుక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్న వాటికి పరిష్కారం దొరకవుట్లేదని ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ పథకాలలో తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగాటం వల్ల అవి లేని వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వాటిని మంజూరు చేసే ప్రజలను ఆదుకోవాలని సాదా బైనామాలు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని ఆక్రమణ గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని తిరుమలాపురం మండలం ఇండ్ల స్థలాలు 125 గజాలు ప్లాట్స్ చొప్పున ఇవ్వాలని పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భం ఎమ్మార్వో మాట్లాడుతూ సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకుడు తుళ్లూరు నాగేశ్వరావు కన్నెగంటి నారాయణ లాలయ్య వెంకట నరసయ్య యశోద కే నాగేశ్వరరావు వెంకన్న జి వీరన్న పుసులూరి వీరభద్రం మందడి ఆనందరావు దాసరి మహేందర్ దాసరి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు














