EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యతన రాష్ట్ర పదాధికారుల సమావేశం

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యతన రాష్ట్ర పదాధికారుల సమావేశం

హైదరాబాద్ జులై 9 (ఈతరం భారతం)

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి  అధ్యతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 12వ తేదీన జరిగే బిజెపి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎజెండాకు సంబంధించి చర్చ విస్తృతంగా జరిగింది.

అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం చేయాలని బిజెపి నిర్ణయించింది.

ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిన్న, ఈరోజుపెద్ద ఎత్తున ధర్నా చేయడం చేయడం జరిగింది.నిన్న, ఈరోజు రాష్ట్రంలోని అనేక మండల కేంద్రాల్లో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెమోరాండం సమర్పించడం జరిగింది.రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల ముందు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.రైతులకు రూ.2లక్ష్లల రుణమాఫీ, రైతు కూలీలలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఫసల్ బీమా యోజన అమలు చేయకపోవడం, వడ్లకు క్వింటాలుకు రూ.500బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసారు.కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ఇచ్చిన వరంగల్ లోనే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు. 1:100 ఇస్తామని చెప్పి 1:50 ఇస్తూ జీవీ విడుదల చేశారు.

జీవో 46 రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు.

రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు.. జాబ్ క్యాలండర్ గురించి అసెంబ్లీలో మాట్లాడి చెప్తామంటున్నారు. ఇది హాస్యాస్పదమన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మాట తప్పుతున్న ప్రభుత్వంగా నిలిచిపోతోంది.

రాబోయే రోజుల్లో ప్రజలను కలుపుకుని ఏవిధంగా ముందుకు పోవాలని ఈనెల 12వ తేదీన జరిగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తాం.శంషాబాద్ లోని మల్లికా కన్వెన్షన్ లో రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు

ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మాజీ సభ్యులు, కార్పోరేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులందరూ పాల్గొంటారు.

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పెద్ద విజయం సాధించిందన్నారు .భవిష్యత్తులో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండడం కోసం పార్టీని పటిష్టం చేయడం కోసం విస్తృతస్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top