EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

హిట్ 3″లో విలన్ గా రానా ?

హిట్ 3″లో విలన్ గా రానా ?

ఈతరం భారతం సినిమా ప్రతినిధి :

హీరోగానే కాదు విలన్ గానూ నటించడం రానా ప్రత్యేకత. రానా ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తూనే విలన్ గా కనిపించేందుకూ రెడీ అవుతున్నారు. నాని హీరోగా తెరకెక్కనున్న హిట్ 3 మూవీలో రానా విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శైలేష్ కొలను హిట్ 3 సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సిరీస్ హిట్, హిట్ 2 సినిమాలు సక్సెస్ కాగా..ఇప్పుడు మూడో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్ లో నాని కనిపించనున్నారు. హిట్ 3లో విలన్ గా రానాను తీసుకుంటున్నారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది. ప్రస్తుతం రానా తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అనే చిత్రంతో పాటు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో మరో సినిమా హీరోగా చేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top