కుందూరు మహేశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
-నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ డిమాండ్
హైదరాబాద్ జూలై న12 (ఈతరం భారతం);రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సుభాన్ పూర్ లోని 13-9, 228, 98, 91, 224, 225 మొదలగు సర్వే నెం. లలో చట్ట విరుద్ధంగా వెంచర్లు నెలకొల్పి ఒకే ప్లాట్లు ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు అమ్మి కోట్ల రూపాయలు అక్రమంగా అర్జీంచడమే కాకుండా తూతూ మంత్రంగా ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రంగారెడ్డి జిల్లా కుందూరు మహేశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎన్ఎస్ హెచ్ఆర్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ఎనుముల సురేందర్, కొల్లు దుర్గా ప్రసాద్ లతో కలసి మాట్లాడుతూ 21 ఎకరాల 31 గుంటలలో అక్రమ లే అవుట్ ద్వారా ప్లాట్లు అమ్మి రూ. 40 కోట్లు సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. ఇతనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో పీడీ యాక్ట్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఈ అక్రమ వెంచర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు రూ. 500 కోట్లు పైగా ఉన్న మహేశ్వర్ రెడ్డి అక్రమ ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రిపిక, ప్రధాన కార్యదర్శి సాయితేజ, తదితరులు పాల్గొన్నారు.














