EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే మనం మారాలి    ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి 

ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే మనం మారాలి

 ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి

సిద్దిపేట జూలై 13 (ఈతరం భారతం);: శారీరక శ్రమ వ్యాయామం లేకపోవడం, జీవనశైలిలో లోపాలతో పాటు వాతావరణం, నీరు, ఆహార కాలుష్యాలు అనారోగ్యానికి కారణాలు అవుతున్నాయని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. సెల్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం, అతిగా తినడం, మద్యం, పొగ తాగటం వంటి అలవాట్లతో 25 ఏళ్ల పైబడిన వారిలో మధుమేహం, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి :

పీడియాట్రిక్ డయాబెటిస్ తో బాధపడుతున్న చిన్నారులకు త్వరగా చికిత్స అందించకపోతే రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. వీరి విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. 25 ఏళ్ల పైబడిన వారిలో అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల ఇటీవల టైప్-2 మధుమేహం సమస్య పెరుగుతుంది. దీంతో కాలేయ వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయి.

కంచంలో ఆ నాలుగు రకాలు ఉండాలి:

తినే పళ్లెంలో రెండు భాగాలు పండ్లు, కూరగాయలు ,ఒక భాగం గింజ ధాన్యాలు, నూనెలు, మరో భాగం మాంస కృత్తులు (పప్పు దినుసులు, చేప, గుడ్లు) ఉండాలి. అల్పాహారం తినకుండా మధ్యాహ్నం పూట ఎక్కువగా తినటం వల్ల స్థూల కాయం పెరుగుతుంది . 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం రాదు. నీరు కూడా పోషకాహారం లెక్కలోకి వస్తుంది. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. రసాలకు బదులు పండ్లను తినాలి. కాఫీ, టీ వీలైనంత వరకు తగ్గించాలి.

యోగా ధ్యానంతో ఒత్తిడి దూరము:

చికాకు, ఆకలి వేయకపోవడం, అలిసిపోవడం, నిద్ర పట్టకపోవడం, రక్తపోటు వంటి వాటికీ ఒత్తిడే కారణం. రుణాత్మక ఆలోచన లే ఒత్తిడిని తీసుకొస్తాయని అనుకోవడం పొరపాటే. ఉదాహరణకు పదోన్నతి ఎంత ఒత్తిడో.. రాకపోవడం అంతే ఒత్తిడి. యోగా, ధ్యానముతో వీటికి పరిష్కారం లభిస్తుంది. పాజిటివ్ గా ఆలోచించడంపై సాధన అవసరమని డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

మెడికల్ ప్రిస్క్రిప్షన్ సలహాతో వ్యాయామం:

పిల్లలు ఆటలకు దూరమై సెల్ ఫోన్ కు బానిస అవుతున్నారు. చాలామంది నిపుణుల సలహాలు తీసుకోకుండా నచ్చిన పద్ధతిలో వ్యాయామం చేయడం, కీళ్ళు, కండరాల నొప్పులు వంటివి వస్తే, చిన్న సమస్య అని వదిలేయడంతో దీర్ఘ కాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యాయామం కూడా మెడికల్ ప్రిస్క్రిప్షన్ తరహాలో ఉండాలి. వ్యాయామములో నొప్పులు వస్తుంటే.. ఫిజియోథెరపీ నిపుణులను సంప్రదించాలి అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top