EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రేపు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన

ఆదివారం పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన

13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి తొలుత మధ్యాహ్నం 1:30 గంటలకు కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫoడ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మం రూరల్ మండలం కొండాపురంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, సాయంత్రం 4:30 గంటలకు ఆరెంపులలో బీటీ రోడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడులో హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు తనగంపాడు గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రి పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు

Related News

Select the Topic
Scroll to Top