EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పెరగనున్న అసెంబ్లీ సీట్లు.. అధికం గ్రేటర్‌ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు మొత్తం సీట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడోవంతు! అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతమిది ఈ ఏడాది చివర్లో మొదలుకానున్న జనగణన ప్రక్రియ!

పెరగనున్న అసెంబ్లీ సీట్లు.. అధికం గ్రేటర్‌ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏలోనే

జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం

రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు

మొత్తం సీట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడోవంతు!

అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతమిది

ఈ ఏడాది చివర్లో మొదలుకానున్న జనగణన ప్రక్రియ!

13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

తె లంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి. పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారుతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. అయితే, తాజా జనాభా లెక్కల ప్రకారం అంతకుమించి పెరిగే అవకాశం ఉందని అంచనా.

వాటిలోనూ అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగడం.. రాష్ట్ర జనాభాలో మూడో వంతుకు పైగా ఈ ప్రాంతంలోనే ఉండడం ఇందుకు కారణం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి పదేళ్లకొకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్‌సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి.

Related News

Select the Topic
Scroll to Top