తెలంగాణలో విందులు, వినోదాలపై నిఘా
13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
వివిధ ఫంక్షన్లు, పార్టీల్లో మద్యం వినియోగంపై ఆబ్కారీశాఖ నిఘా విస్తృతం చేస్తోంది. సుంకంచెల్లించని మద్యం(నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్-ఎన్టీపీఎల్) వినియోగంపై ఇప్పటికే దాడులునిర్వహిస్తుండగా.. ఇకపై ప్రత్యేక బృందాలనురంగంలోకి దించనుంది. ఎన్డీపీఎల్ మద్యంవినియోగించడంపై ఈ ఏడాది 302 కేసులు నమోదుచేశారు. 165మందిని నిందితులుగా చేర్చి 35వాహనాలను, రూ.61.13 లక్షల విలువైన మద్యాన్నిజప్తు చేశారు.














