అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రధాని మోడీ
ఈతరం భారతం 14 7 2024, న్యూఢిల్లీ :
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై భారత ప్రధాని మోడీతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
“నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడి పై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని మోడీ చెప్ ఎక్స్ హ్యాండిల్ లో ట్రీట్ చేశారు . ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి గాయపడిన వారికి అమెరికా ప్రజలకు తన సానుభూతిప్రకటించారు .
అమెరికాలో ట్రంప్ ను రెండుసార్లు అభిసంసించారు .నాలుగు సార్లు అరెస్టు చేశారు 91సార్లు అతనిపై అభియోగాలు మోపారు, అనంతరం అతడిని బ్యాలెట్ నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు ఇప్పుడు అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు అని ప్రజలు చర్చించుకుంటు న్నారు.














