EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పేద విద్యార్థిని చదువుకు వెస్సో ఆర్థిక సహాయం

పేద విద్యార్థిని చదువుకు వెస్సో ఆర్థిక సహాయం

హైదరాబాద్ జూలై 15 (ఈతరం భారతం) హైదరాబాద్ కర్మన్ఘాట్ జనార్దన్ రెడ్డి నగర్ లోని ఒక మురికివాడలో నివాసముండే గడ్డం రఘు(53) జీవనోపాధికై టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలనూ పెంచి పోషించి, చదువు చెప్పించలేక పెద్ద కూతురును పెంపకానికై బంధువులకు ఇచ్చేసారు. రెండవ కూతురు ప్రియాంక పాలిటెక్నిక్ డిప్లమా లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై టాప్ కాలేజీలలో ఒకటైన ఎం వి ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కూడా సంపాదించింది. కానీ ఫీజు అధికంగా ఉండి చెల్లించడం కష్టంగా భావించిన రఘు ఆర్థిక సహాయానికై వెస్సో ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెస్సో ట్రస్ట్ గౌరవ దాతల సహకారంతో రఘు కు 30,100/-లు అందజేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ చింతలకుంట వాసవి కాలనీలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఒక సేవా కార్యక్రమంలో 30,100/- చెక్కును గౌరవ దాత కొచ్చెర్ల సూర్య భాస్కర రావు  (విశ్రాంత డిజిఎం, బిఎస్ఎన్ఎల్) మరియు వారితో పాటు గౌరవ దాత, బిల్డర్ పోలోజు రవీంద్ర చారి కలిసి రఘు, ఆయన కూతురు ప్రియాంక, ఆయన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా కొచ్చెర్ల సూర్య భాస్కర రావు గారు 5000/-ల తన సొంత చెక్కును కూడా రఘుకు ఆర్థిక సహాయంగా బహుకరించారు. ఈ కార్యక్రమానికి వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతా రావు, తెలంగాణ వయవృద్ధుల సంఘం సెక్రటరీ వెదురుపర్తి శ్రీ మంగేష్, సిరికొండ రాజేందర్ గార్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా బంగారు తాతారావు మాట్లాడుతూ పేద విద్యార్థిని ప్రియాంక ఇంజనీరింగ్ చదువుకు ఆర్థిక సహాయం చేసిన గౌరవ దాతలు అందరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top