సీఎంతో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి భేటి
బాధ్యతల స్వీకరణ తర్వాత మర్యాద పూర్వకంగా సమావేశం
సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు జగ్గారెడ్డి ప్రతిపాదనలు
హైదరాబాద్, జూలై 17 (ఈతరం భారతం); టీజీఐఐసీ చైర్పర్సన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డి.. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎం కు ఆమె పులగుచ్చం ఇచ్చి అభినందనలు తిలిపారు.ఆమెతోపాటు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సైతంఉన్నారు. ఈ సందర్భంగా వారి క్షేమ సమాచారాన్ని సీఎం రేవంత్ ఆరాతీశారు. కాగా, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి సమర్పించారు. ఆ ప్రతిపాదనల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు














