EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బ్రాహ్మణ పరిషత్తు కు వేంటనే నిధులు కేటాయించాలి  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్

బ్రాహ్మణ పరిషత్తు కు వేంటనే నిధులు కేటాయించాలి

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్

హైదరాబాద్ జూలై 17 (ఈతరం  భారతం);బ్రాహ్మణ పరిషత్తు కు వేంటనే నిధులు కేటాయించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బుదవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని పనులు కు బ్రాహ్మణుల ఆశిస్సులు తీసుకున్నారని,అధికారంలోకి వస్తే బ్రాహ్మణుల బాగోగులు చూస్తాం అన్నారనికాని అధికారంలోకి వచ్చిన అనంతరం వారిని గాలికి వదిలేశారని విమర్శించారు.. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా అనేక మంది బ్రాహ్మణుల విద్యార్థులు విదేశాలకు వెళ్లారు ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్తు కు ఒక్క పైసా కూడా చెల్లించలేదు దీంతో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకోలేక.. చదువు కొనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో బ్రాహ్మణ పరిషత్తు తో ప్రారంభించిన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. బ్రామ్మనులను పట్టించుకోక పొతే వేద పండితుల ఉసురు సిఎం కు తగులుతుందన్నారు. గోపూజ చేసే రేవంత్ రెడ్డి సర్కారు హయాంలో గో హత్యలు జారుతున్నాయి ఆలయాల నిర్వహణ కూడా అధ్వాన్నం గా ఉంది గతం లో ఏ ప్రభుత్వం కూడా స్వయంభూ దేవాలయాల నుంచి బ్రాహ్మణులను బదిలీ చేయలేదుకాని రేవంత్ రెడ్డి సర్కారు వారిని బదిలీ చేస్తామంటే హైకోర్టు మొట్టికాయలు వేసింది ఆలయాల విషయం లో తలదూర్చవద్దని సీఎం రేవంత్ రెడ్డి కి హితవు పలికారు.బ్రాహ్మణ పరిషత్తు కు వేంటనే నిధులు కేటాయించాలిరాజకీయంగా ఎదిగేందుకు వీరి సహకారం, ఆలోచనలు , ముహూర్తాలు పెట్టించుకుని టాడుఅలాంటి వారికి అన్యాయం చేయకుండా ఆదుకోవాలి బ్రాహ్మణ పరిషత్తు కు నిదులు కేటాయించక పోతే బీజేపీ ఓ కార్యాచరణ తీబుకుంటుందని ఈ సందర్బంగా హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top