తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో పోటెత్తిన శైవ, వైష్ణవ ఆలయాలు
హైదరాబాద్ /అమరావతి (ఈతరం భారతం);తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు .తెలంగాణలోని వేములవాడ, కొమురవెల్లి, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో దీపాలు వెలగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవ స్మరణలోగడిపారు . ఎపిలోనూ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం వంటి పుణ్య క్షేత్రాలకు భక్తులు చేరుకుని దర్శించు కున్నారు.కాగా ఏకాదశి సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు














