జూరాలకు కృష్ణమ్మ పరుగులు.
18.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి . దీంతో ఆ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన ఉన్న జూరాల జలాశయానికి నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. రెండు మూడు రోజుల్లో జూరాల పూర్తి నీటిమట్టం అయితే . ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది…














