బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరాటం
ఆగస్టు 5,6,7 తేదీలలో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడి
పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ జూలై 18 (ఈతరం భారతం); : బీసీలకు సామాజిక న్యాయం చేయకపోతే కేంద్రంపై మిలిటెంట్ పోరాటం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్ లో జాతీయ బీసీ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఆధ్వర్యంలో 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఆర్.కృష్ణయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హాజరయ్యారు.అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ సమస్యల సాధనకై ఆగస్టు 5,6,7 తేదీలలో జాతీయ బీసీ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించాలని, అందుకు పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ చేయాలన్నారు. వీహెచ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.లక్ష్మణ్ యాదవ్, నీల వెంకటేశ్, నందగోపాల్, వి.రామకృష్ణ, జి.మల్లేశ్, ఉదయ్, జ్యోతి, కరుణ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.














