దమ్మాయిగూడ ప్రాంత సమస్యలు పరిష్కరించండి
ఎంపి ఈటల రాజేంద్రకు సమస్యలు వివరించిన గాలి సంపత్ యాదవ్
మేడ్చల్ జూలై 19 (ఈతరం భారతం) ;మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్రను భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలాగే రాష్ట్ర రైతు హక్కుల సహకార కమిటీ ప్రెసిడెంట్ గాలి సంపత్ యాదవ్ సమక్షంలో పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర ను కలిసారు. ఈ సందర్బంగా సంపత్ యాదవ్ దమ్మాయిగూడ లో ఉన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకు వచ్చారు. వారు చర్చించిన పలు విషయాలు భవాని నగర్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య సైలెంట్ ఎంక్లేవ్ రోడ్డు సమస్య అందరూ నడుస్తూ ఇబ్బంది పడుతున్నారని ఆ రోడ్డును కూడా సగం రోడ్డు వేశారు సగం చేయలేదు మిగతా రోడ్డు వేయాలని తెలియపరచడం జరిగింది. అలాగే ప్రగతి నగర్ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ సమస్యల తో పాటు ఎన్నో రోజుల నుండి పరిష్కారం కానీ స్మశాన వాటిక స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రథమ సమస్యగా తమరు దీనిని పరిష్కరించాలని దమ్మాయిగూడ ప్రజల తరఫున సంపత్ యాదవ్ వారి దృష్టికి తీసుకువచ్చారు, అలాగే బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ వరకు ఉన్న రోడ్డు విస్తీర్ణం సరిగా లేనందున ట్రాఫిక్ సమస్యలతో స్థానికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాగే డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని ఎన్నిసార్లు ఎందరో నాయకులకు చెప్పినా దాని నుండి వచ్చే దుర్వాసనను ఏ నాయకులు పరిష్కరించకుండా ప్రజలను దుర్వాసన పాలు చేస్తున్నారని, వారి ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడంలేదని వారికి తెలియజేశారు. అలాగే ప్రగతి నగర్ కాలనీలో స్కూల్ స్థలంగా ఉన్న ఎనిమిది వందల నాలుగు గజాల స్థలాన్ని ఆక్రమదారులు దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుట ప్రయత్నం చేస్తున్నారు, దానిని ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వ ప్రాథమిక వైద్య (హెల్త్) సెంటర్ గా ఏర్పాటుచేసి ప్రజలకు వైద్య సౌకర్యం అందుబాటులో ఉండేలా చేయాలని ప్రాధేయపడ్డారు. అలాగే పలు కాలనీలోని పార్కు స్థలాలను కొనుగోలు అభివృద్ధిలోకి తీసుకురావాలని ముఖ్యంగా ప్రగతి నగర్ కాలనీలో ఉన్నటువంటి పార్కు స్థలాలు అన్యక్రాంతం కాకుండా అభివృద్ధి చేసి ఆక్రమణదారుల ఆగడాలు అరికట్టాలని వారి దృష్టికి తీసుకువచ్చారు.: ఈ తేలను కలిసిన వారిలో వివిధ కాలనీల ప్రెసిడెంట్ లు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు














