బిబికా ఆలమ్ కు దట్టిని సమర్పించిన జి.హన్మంత్ రావు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం
హైదరాబాద్ జూలై 19 (ఈతరం భారతం);మొహరం పురస్కరించుకొని హైదరాబాద్లోని మీరాలం మండి వద్ద బిబికా అలాం కు జయహో భారతీయం అధ్యక్షుడు జి.హన్మంత్ రావు, రాష్ట్ర బీసీ కమిషన్ తెలంగాణ చైర్మన్ డా. వి. కృష్ణ మోహన్ రావులు దట్టిని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ నగరం నిలిచిందన్నారు మొహరం ఊరేగింపు లో హిందూ ముస్లిములు కలిసి పాల్గొనడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమం లో హిదాయెత్ అలీ మీర్జా డైరెక్టర్ షియా మండలి, సయ్యద్ మహమూద్ అలీ, హాషమ్ హుసన్, సయ్యద్ సయీద్ అల్లం, ఇ. మాణిక్యం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.














