EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

19.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

తిరుమలాయపాలెం :  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల వాగ్దానం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో ముందంజలో ఉందని మండల కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్ అన్నారు. రైతు ఋణమాఫీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా రెండు లక్షల రుణమాఫీని చేయబోతున్నామని తెలిపారు, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించిన తేదీ లోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ వడ్డీలకుకూడా సరిపోలేదని విమర్శించారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేడు లక్షలోపు ఉన్న రైతులకు నేరుగా తమ అకౌంట్లో జమ చేయడం జరుగిందని, లక్ష యాభై వేల రూపాయల వరకు ఈ నెల చివరి వరకు చేసి వచ్చే నెల మొదటి వారానికి రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తారని తెలిపారు. ఈ ఋణమాఫీ సందర్బంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు లకు రైతులు ఋణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చిప్పరపల్లి రమేష్ ఉన్నం వెంకయ్య పోట్ల రామయ్య నరేష్ వేణు వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top