కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో స్కాం
రేవంత్ సర్కార్ ది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన
కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మరోసారి మోసం చేసింది
రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రతి స్కీమ్ లో స్కాం ఉంటుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ లోని మీడియా హాల్ లో మెదిఆ సమావేశం లో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మరోసారి మోసం చేసింది.రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు.రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారు. రుణమాఫీ కొంతమందికే చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెట్టి,గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన విధంగానే ఇప్పడు చేస్తున్నా రన్నారు.. రైతు పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కావట్లేదు. రెండు లక్షల రుణమాఫీ ప్రతీ రైతుకు కావాలి,లేనట్లయితే అసెంబ్లీ, సచివాలయం ముట్టడిస్తాం అని హెచ్చరించారు. రైతు భరోసా యసంగి పంట కు ఇవ్వలేదు, ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు.. రైతు రుణమాఫీ అసెంబ్లీలో చర్చించకుండానే చేశారు కదా?మరి రైతు భరోసా చెల్లింపులో అసెంబ్లీలో చర్చ దేనికో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.. రైతు భరోసా ఎగ్గొట్టడానికి మాత్రమే అసెంబ్లీలో చర్చ ముందుకు తెస్తున్నారు. గత ప్రభుత్వం రైతుల డాట సరిగా ఇవ్వలేదు, అప్పటి డేటా ప్రకారం పీఎం కిసాన్ సమ్మాన్ డబ్బులు కేంద్రం వేస్తోందని తెలిపారు. ఇది ఎన్నికల హామీలో లేదు, బీజేపీ ఇవ్వలేదు, ఐన రైతుల కోసం ఇస్తున్నాము, డేటా పెరిగిన కేంద్రం ఇస్తుంది. రేవంత్ సర్కార్ రైతు,విద్యార్థి, నిరుద్యోగ, ప్రజావ్యతిరేక ప్రభుత్వ మని మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు














