మహిళా సాధికారికతే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రూప దేవి
హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం మాతృ ప్రేమతో పరిపాలన మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఇండియన్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మున్డుకేలుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ అన్నారు. శనివారం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయలక్ష్మి సమక్షంలో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా మునగాల రూపాదేవికి నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా రూపా దేవి మాట్లాడుతూఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పంచసూత్రాలైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితం భారతదేశం మొత్తం సంపూర్ణ మద్యపాన్నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ ,ప్రతి కుటుంబం సుఖసంతోషాల తో జీవించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు ఆకర్షితురాలినై ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ లో చేరినట్టు తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అలాగే మహిళా సాధికారతకై ప్రభుత్వ పథకాలపై మహిళలకు అవగాహన కలిగించే సమావేశలను నిర్వహించి పథకాలను సులభంగా మహిళలకు అందే విధంగా కృషి చేయనున్నట్టు తెలిపారు.














