కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు మరింత అన్యాయం
నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా బీజేవైఎం దీక్షలో బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి, తీవ్ర అన్యాయం చేసిండాంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు మరింత అన్యాయం చేస్తునారని బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా బీజేవైఎం దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తోందన్నారు.మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకు వస్తాయని యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడారన్నారు.యువత డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాల కల్పన, రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధి కోసం రూ. 10 లక్షల ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాటమార్చి అన్యాయం చేసిందని విమర్శించారు.డిమాండ్ల సాధన కోసం నినరసన తెలుపుతున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ లతో, కేసులు, నిర్భంధాలతో అణచివేస్తున్నరన్నారు.నిరుద్యోగులకు అండగా బిజెపి నిలుస్తుందని తెలిపారు.నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతామన్నారు.రేవంత్ బాబా 11 దొంగలుగా మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకుని పాలన నడిపిస్తున్నరని దుయ్యబట్టారు.














