EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ ఏర్పడి దశాబ్ధమయినా ఎక్కడి సమస్యలక్కడే

తెలంగాణ ఏర్పడి దశాబ్ధమయినా ఎక్కడి సమస్యలక్కడే

 రాష్ట్రంలో పెరిగిపోతున్ననిరుద్యోగం, భూ ఆక్రమణలు

 నీటి పారుదల ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మండిపడ్డారు.

బంగారు తెలంగాణ అంటూ బానిస తెలంగాణగా మార్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం

 టిఆర్ఎస్(డి) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ

హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు గడుస్తున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్-(టిఆర్ఎస్)(డి) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ఆరోపించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం, భూ ఆక్రమణలు, రైతుబంధు, విద్యుత్ సమస్యలు పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటూ బానిస తెలంగాణగా మార్చారని విమర్శించారు. లక్షల కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని మండిపడ్డారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తాము అధికరంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిపేస్టోలో పెట్టిందని, అధికరంలోకి వచ్చి ఆరు నెలలకు పైగా గడుస్తున్నప్పటికీ కనీసం లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని వారికి ఉద్యోగాలు వచ్చేంతవరకు ప్రభుత్వం నిరుద్యోగ భృతికింద నెలకు రూ.3వేలు ఇవ్వలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాలో పర్యటిస్తుందని, భవిష్యత్తులో తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలతో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ మాలోతు విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు కంచర్ల మందుశ, ఉపాధ్యక్షురాలు బోయిన ప్రత్యూష, రాయల సంధ్య, అఖిల్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top