EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మేరు కులస్తులను బిసి’డి’ నుండి బిసి’ఏ’ లో చేర్చాలి   ప్రభుత్వం బట్టలు కుట్టే టెండర్స్ మా మేరు కులస్తులకే ఇవ్వాలి   తెలంగాణా మేరు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్

మేరు కులస్తులను బిసి’డి’ నుండి బిసి’ఏ’ లో చేర్చాలి

 ప్రభుత్వం బట్టలు కుట్టే టెండర్స్ మా కులస్తులకే ఇవ్వాలి

 తెలంగాణా మేరు సంఘాల జాయింట్ఆక్షన్ కమిటి డిమాండ్

హైదరాబాద్ జూలై 21 (ఈతరం భారతం);మేరు కులస్తులను బిసి’డి’ నుండి బిసి’ఏ’ లో చేర్చాలని తెలంగాణా మేరు సంఘాల జైంట్ ఆక్షన్ కమిటి డిమాండ్ చేసింది.ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జేఏసి చర్మెన్ మునిగాల రాము, వ్యవస్థాపకులు సంఘం వెంకటరాజ్యం, అధికార ప్రతినిధి కొత్త నరసింహస్వామిలతో కలిసి మాట్లాడారు. మేము టైలర్ కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేర కులస్తులమని, కుల వృత్తుల మీద ఆదారపడి జీవించే కులాలు బీసీలలో ఉన్నప్పటికీ మా మేరుకులను బీసీ’డీ’ లో ఉండటం వలన మాకు విద్య ఉద్యోగ ఉపాధి వంటి రిజర్వేషన్లు అందక మా కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడిపోయామని ఆవీదన వ్యక్తం చేసారు. మా కులవృత్తి బట్టలు కుట్టే కులం, వృత్తిపరంగా చేతుల నిండా పని లేక మా కులస్తులు వీధిని వడ్డారన్నారు. ప్రభుత్వం బట్టలు కుట్టే టెండర్స్ మా కులవృత్తి పనులు మాకే ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.బి సి డి నుండి బీసీఏల్లోకి చేర్చాలని గత ప్రభుత్వాన్ని అనేకసార్లు విన్నవించుకోవడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మా బ్రతుకులు మారాలి అని తెలంగాణ రాష్ట్ర మేరు జేసిపిలుపు నిచ్చి అనేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా మేరు కులం వారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధితో గెలుపు కొరకు కృషి చేశాం మా కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది మాకు 100 రోజుల్లోపు కార్పొరేషన్ ఇచ్చిందని తెలిపారు. అందుకు మమ్ములను గుర్తించి సహకరించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర మేల్ కులస్తుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారూ. ఇప్పుడు మా కులాన్ని బీసీ డీ నుండి సవరించి బీసీఏ చేర్చాలని, స్థానిక ఎన్నికల్లో మా మేల్ కులస్తులకు ప్రాధాన్యత ఇచ్చి నామినేట్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాంఈ ఈ సమావేశంలో జేఏసీకన్వినర్స్ శీలం నగేష్, పోల్కం శ్రీరామ్, పోలిశెట్టి దేవదాసు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top