కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 30,700పై కి. మీ. సైకిల్ యాత్ర
వరంగల్ జూలై 21 (ఈతరం భారతం);భారత దేశ ప్రజలు వారి యొక్క సాంసృతిక జీవన విధానం, కళలు, గూర్చి సైకిల్ పై 30,700పై కి. మీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువ కళాకారుడు తెలంగాణ ముద్దుబిడ్డ, చెన్నూర్ నివాసి శ్రీ పోచమ్ “కళ యాత్ర” చేసివారి గురువు శ్రీ సత్యనారాయణ ను మర్యాద పూర్వకంగా కలిసి కళయాత్ర విశేషమైన అనుభవాలను పంచుకున్నారు.వారిని దేశంలోని అన్ని చోట్లా , అన్నీ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు ఘన స్వాగతం పలికారని, అందుకు ఒక భారతీయ పౌరునిగా గర్వంగా ఉందని అన్నారు. నిరతరం కళ ఉపాధ్యాయుల అభ్యున్నతికి కృషి చేస్తున్నా తెలంగాణా రాష్ట్ర ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇంస్త్రక్టర్స్ అసోసియేషన్ (TACA) వ్యవస్తాపక అద్యక్షులుతిరువరంగం ప్రభాకర్ మరియు రాష్ట్ర అధ్యక్షలు టి. కేశవ్ కుమార్ లకు ప్రత్యేకమైన అభివందనాలు తెలిపారు.














