EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రశ్నించే గొంతుకులను బిజెపి ప్రభుత్వం అణిచివేస్తుంది         కేజ్రీవాల్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి      ఢిల్లీ అసెంబ్లీ చీప్ విప్, ఆప్ తెలంగాణ ఇంచార్జి దిలీప్ పాండే

ప్రశ్నించే గొంతుకులను బిజెపి ప్రభుత్వం అణిచివేస్తుంది

        కేజ్రీవాల్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

     ఢిల్లీ అసెంబ్లీ చీప్ విప్, ఆప్ తెలంగాణ ఇంచార్జి దిలీప్ పాండే

హైదరాబాద్ జూలై 21 (ఈతరం భారతం); : ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకులను బిజెపి ప్రభుత్వం అణిచివేస్తుందని ఢిల్లీ అసెంబ్లీ చీప్ విప్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దిలీప్ పాండే అన్నారు. అందులో భాగంగానే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆప్ నాయకులను బీజేపీ జైల్లలో పెడుతుందన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తో కలసి దిలీప్ పాండే మాట్లాదారు. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ దేశానికి మార్గదర్శిగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే జైల్లో పెట్టిందన్నారు. బిజెపికి సరైన ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తించి, ఆప్ ను నామరూపం లేకుండా చేయాలని చూస్తుందన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వానికి కూల్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన బయపడబోమని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని అన్నారు. పార్టీ నాశనానికి బీజేపీ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కానీ పార్టీకి ఢిల్లీ, పంజబ్ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతాం అన్నారు. ఆప్ పాలిత రాష్ట్రాలు విద్య, వైద్యంలో దేశంలో నెం.1 గా ఉన్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు ఆప్ ను అందరిస్తారని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఆప్ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. ప్రజా సమస్యలు విస్మరిస్తే కాంగ్రెస్ పై కూడా పోరాటం సాగిస్తాం అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ కేజ్రీవాల్ ను చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.. షుగర్ పెషేంట్ అని తిలిసి కూడా ఆయనకు మందులు ఆపేయడం లో అంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనితి ఆయన 8 నుండి 10 కిలోల బరువు తగ్గారని అన్నారు. అయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగాలేదన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే బిజెపి ఈ విధంగా వ్యవహారిస్తుందని అన్నారు. జైల్లో పెట్టి ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. భవిష్యత్తులో తామంతా జై కేజ్రీవాల్ అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని ప్రకటించారు. కేజ్రీ వాల్ మనిషి కాదు ఆలోచన అని అన్నారు. కేజీ వాళ్ళను అరెస్ట్ చేస్తే పార్టీ పని అయిపోతుందని బిజెపి అనుకుందని అన్నారు. పార్టీ నాశనానికి బీజేపీ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కానీ పార్టీకి ఢిల్లీ, పంజబ్ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఆప్ పాలిత రాష్ట్రాలు విద్య, వైద్యంలో దేశంలో నెం.1 గా ఉన్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు ఆప్ ను అందరిస్తారని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఆప్ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. ప్రజా సమస్యలు విస్మరిస్తే కాంగ్రెస్ పై కూడా పోరాటం సాగిస్తాం అన్నారు. ఈ సమావేశంలో ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డా. సల్మాన్ రాజ్, ఎంఏ మజీద్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ యమునా గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు విజయ్ ముల్లంగి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top