ఉజ్జయిని మహంకాళి ని దర్శించు కున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
21.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి తోపాటు పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు














