రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్ జూలై 21 (ఈతరం భారతం);తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను ఆనుకొని ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న 12గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. రుణపవన ద్రోణి సగటు సముద్రమట్టం వద్ద జైసల్మేర్, కొటా, గుణ, మాండ్లా, ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్.. తూర్పు-ఆగ్నేయ బంగాళాకాతం మీదుగా అల్పపీడనం మధ్యగా వెళ్తుందని తెలిపింది. ఈ క్రమంలో రాగల మూడురోజు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లా భారీ వర్షాపాతం నమోదైంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, హన్మకొండ, ములుగు, ఆదిలాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం రికార్డయ్యింది. మరికొద్ది జిల్లాల్లో మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వెంపల్లెలో 18.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే, ముప్కల్లో 12.5, అలూర్‌లో 15, నవీపేటలో 11.8, రేంజల్లో 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా మామడలో 13.8, ఖానాపూర్‌లో 11.9, ములుగ జిల్లా మల్లంపల్లిలో 12.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.














