హామీలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటన చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా.చీమ శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 22 :(ఈతరం భారతం ) తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను నేరవేర్చటంపై ఈనెల 23 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలోనే స్పష్టమైన ప్రకటన చేయాలనితెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా.చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లే తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన 250 ఇంటి స్థలం, పెన్షన్ హామీలను ఈనెల 23 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. నిరుద్యోగ ఉద్యమకారులకు వడ్డీలేని రుణాలు కల్పించాలని కోరారు. ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి వారికి ఉచిత ఇల్లు కట్టించి కాళీలను ప్రతి నియోజకవర్గంలో కేటాయించాలని అన్నారు. సెప్టెంబర్ 14న తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, జానకి రెడ్డి, నరేందర్ గౌడ్, ఇంద్ర కుమార్, యాదిరెడ్డి, వీరస్వామి, కొండ స్వామి, దయానంద, భాస్కర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, పోచయ్య, రామచందర్, కీర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.














