23న మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
22.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
ఈ నెల 23న మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.
ఇక 25వ తేదీన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. అనంతరం శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు.














