ఎక్సీమ్ బ్యాంక్ కుంభకోణం పై సిబిఐ ఎంక్వైరీ చేయాలి
ఎక్సీమ్ బ్యాంక్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీకి బాగాస్వామ్యం
యూరో ఎక్సిమ్ బ్యాంక్ ఒక ఫైనాన్స్ కంపనీ
ఈ బ్యాంక్ గ్యారెంటీ మన దేశంలో చెల్లదు
ఆర్బీఐ గైడ్లైన్ లో లేని ఫైనాన్స్ కంపెనీకి ఎస్బిఐ గ్యారంటీ ఇచ్చింది
కుంభకోణంలో పాత్ర ఉన్న పొంగులేటికి కేబినెట్ లో ఉండే అర్హత లేదు
మంత్రి పొంగులేటి పై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు
హైదరాబాద్ జూలై 22 (ఈతరం భారతం);మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. సోమవారం అసెంబ్లీ ప్రెస్ మీట్ పాయింట్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ యూరో ఎక్సీమ్ బ్యాంక్ కుంభకోణంలో మంత్రి కంపెనీ భాగస్వామిగా ఉందని ఆరోపించారు. ఇదీ దేశంలోనే భారీ కుంభకోణం ఇందులో చాలా మంది బడా కాంట్రాక్టర్లతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రమేయం ఉంది. ఇందులో కేబినెట్ మంత్రి భాగస్వామి గా ఉండటం బాధాకరం.ఇది వేల కోట్ల కుంభకోణం కు సంబందించిన భ్యాంక్ గ్యారంటీ ల విషయం.దేశ చట్టాలకు సంబంధం లేనట్టువటి యూరో ఎక్సిమ్ బ్యాంక్ సెయింట్ లూసియా అనే చిన్న దివిలో ఉంది .యూరో ఎక్సిమ్ బ్యాంక్ ఒక ఫైనాన్స్ కంపనీ .ఈ బ్యాంక్ గ్యారెంటీ మన దేశంలో చెల్లదు, అయినా ఏజెన్సీలు దీన్ని యాక్సెప్ట్ చేయడం గమనార్హం .ఆర్బీఐ గైడ్లైన్ లో లేని ఫైనాన్స్ కంపెనీ ఒక్క లెటర్ రాస్తే …స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చింది .ఈ లెటర్ ఐడిచూస్తే ఎస్బిఐ గ్యారంటీ ల ఉంది .ఇది ఒక ఉదాహరణ మాత్రమే..నన్నారు..ఈ గ్యారంటీ లెటర్ నిజమో కాదో, తేల్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.ఆ బ్యాంక్ గ్యారెంటీ రూ. 8 కోట్లు అయితే ఎస్బిఐ వందల కోట్లు ఏ విధంగా గ్యారంటీ ఇస్తది?.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కు గ్యారంటీ ఇచ్చింది..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.యూరో ఎక్సీమ్ బ్యాంక్ కుంభకోణంలో మంత్రి కంపెనీ భాగస్వామిగా ఉంది.ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కేబినెట్ లో ఉండే అర్హత లేదన్నారు.ఈ కుంభకోణం పై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరాలి.దీని వెనుక ఎంత పెద్దవారున్న శిక్షించాలి .దాదాపు నాలుగు వందల మంది కాంట్రాక్టర్లకు ఈ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చింది .కాంట్రాక్టర్లు సగంలో పని వదిలేసి వెళ్లిన ….డబ్బులు తీసుకొని పారిపోయిన డబ్బులు లిక్విడేషన్ కాదు .ఈ బ్యాంక్ గ్యారెంటీ లు అన్ని కేన్సిల్ చేయాలి . ఇలాంటి అవకతవకలకు సంభందించిన చాలా అంశాలు ఉన్నాయి ఇంకా ఎంత మంది ఉన్నారన్నది రానున్న ప్రెస్ మీట్ లో చెప్తా నన్నారు.ఈ స్కాంలో పెద్ద తలకాయలు అన్ని త్వరలోనే బయటికి వస్తాయి గ్యారంటీలు నిజంగా బ్యాంకులు ఇచ్చాయా..? లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయాలి.














