పెద్దపల్లి , నవంబర్ 22(ఈ తరం భారతం);): విధి నిర్వహణ లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు విరివిగా నమోదు అవుతున్న నేపథ్యంలో కేసుల నుంచి రక్షణకు ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని ఎన్యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ పురుషోత్తం నారగౌని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ, జర్నలిస్టుల రక్షణ కోసం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు పరచాలని అన్నారు.. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు, మరియు తప్పుడు కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు.సమావేశంలో మంచిర్యాల సీనియర్ రిపోర్టర్ రాజ్ పటేల్, టీ. ఎస్. జే.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, భూపాలపల్లి నాయకులు గట్టు రవీందర్ గౌడ్ హాజరయ్యారు.
ప్రధాన డిమాండ్లు:
1. చిన్న పత్రికలను తక్షణమే గుర్తించి, వాటిని ఎమ్పానెల్మెంట్లో చేర్చాలని కోరారు.
2.సంక్షేమ పథకాలలో యూనియన్ల జోక్యం లేకుండా చూడాలి
జర్నలిస్టుల సంక్షేమ పథకాలు నేరుగా అమలు చేయాలని, యూనియన్ల జోక్యం లేకుండా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
3.మీడియా రంగానికి ప్రత్యేక పాలసీ రూపొందించి, జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు.
4. మీడియా ఉద్యోగుల సంక్షేమం
జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన బీమా, పెన్షన్, మరియు ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.














