EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాజకీయ పునరావాస నామినేటెడ్ పదవుల జి ఓ ను రద్దు చేయాలి

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 7 :

తెలంగాణ రాష్ట్రం లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని బిజెపి రాష్ట్రనేత కొలను వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజలను పట్టించుకోకపోవడం ,ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం వల్ల వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ జడ్పిటిసి సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై పట్టు కోల్పోయాడని, దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్రాన్ని విమర్శించండం తప్ప పరిపాలనను గాలికి వదిలేసాడని విమర్శించారు. ఎంపీటీసీ సింగిల్ విండో ఎన్నికలు జరపకపోగా వాటికి నామినేటెడ్ పెదవులలో పార్టీ శ్రేణులు నియమించి మూలంగా రైతులకు రావలసిన సౌకర్యాలు అనడం లేదని ,పాలన వ్యవస్థ లేకపోవడం మూలంగా సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు అంతేకాకుండా నేడు రాష్ట్రంలో యువతీ యువకులు రైతులు,విద్యార్థులు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతో ఉన్నారన్నది స్పష్టమవుతుంది అన్నారు .రైతు భరోసా కు తూట్లు పొడిచి రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసారని ఆయన దుయ్యబట్టారు.ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి కాంగ్రెస్ శ్రేణులకు రాజకీయ పునరవాసము కల్పించడం కోసం కుట్రలు చెస్తుందని ఆరోపించారు. వెంటనే రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ శ్రేణుల రాజకీయ పునరావాస నామినేటెడ్ పదవుల జి ఓ ను రద్దు చేయాలని కోలన్ శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top