వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమంను పెద్దమోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ కమ్యూనిటీ హ్యాండ్స్ఆన్ కార్డియోపల్మనరీ రిసక్టేషన్ (సి. పి. ఆర్) పై మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏటా లక్షమందిలో 4,280 మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని, వీటి శాతాన్ని తగ్గించేందుకు సిపిఆర్ అవగాహన కార్యక్రమాలను గత మూడు సంవత్సరములుగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సాయి చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హఠాత్తుగా కుప్పకూలటం, అపస్మారక స్థితికి వెళ్లడం, శ్వాస అందకపోవడం, నాడీ కొట్టుకోకపోవడం, ఛాతిలో నొప్పి తదితర లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయని, సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైతే రెండు చేతులతో సిపిఆర్ ప్రక్రియ చేపట్టి బతికించవచ్చన్నారు. బలముగా, వేగముగా చాతి మధ్యలో నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఐదు సెంటీమీటర్ల లోతులో మర్దన చేయడాని సిపిఆర్ అంటారన్నారు. ఆకస్మికంగా వచ్చే కార్డియాక్ అరెస్టుతో రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కార్డియాక్ అనేది సమయము, సందర్భము, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా సడన్ కార్డియాక్ అరెస్టు వచ్చే ప్రమాదం ఉందని సాయి చౌదరి హెచ్చరించారు. అయితే సకాలంలో సిపిఆర్ చేయటం వల్ల వీరి ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది సూచించారు. సడన్ కార్డియాక్ అరెస్టు, హార్ట్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని కండ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నారని సాయి చౌదరి గుర్తు చేశారు. అయితే సిపిఆర్ చేయటం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి వివరించారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్టు అయిన ప్రతి పదిమందిలో ఒకరు మాత్రమే బ్రతుకుతున్నారని, సిపిఆర్ సకాలంలో చేస్తే కనీసం ఐదుగురిని బ్రతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నాయని సాయి చౌదరి ఉదహరించారు. అనుకోని ప్రమాదాలు, దుర్ఘటన జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్ కి గురవుతాడని, ఈ సమయంలో హృదయస్పందనలో తేడా వస్తుందని, గుండెలయతప్పి ఆగిపోతుందని, అలాంటి సమయంలో మనిషి స్పందించడని, శ్వాస ఆగిపోతుందని, ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శాసన అందించడం వల్ల గుండె, ఊపిరితిత్తులు తిరిగి పెంచేస్తాయని దీన్నే సిపిఆర్ అంటారని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు. దీన్ని తెలుగులో హృదయ శ్వాస పునరుద్ధరణ అని అంటారని సాయి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమమునకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినిలు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.