తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలబరిలో టీటీడీపీ పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సమాయత్తం చేస్తున్నారు. పార్టీకి బలమున్న నియోజకవర్గాల్లో పోటీచేయాలని తెలంగాణ తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. 2009లో కూడా కుత్బుల్లాపూర్ నుంచే కాసాని పోటీచేశారు. ఖైరతాబాద్ నుంచి అర్వింద్ కుమార్ గౌడ్ పోటీచేసే అవకాశం ఉంది. మునుగోడు బరిలో ఐలయ్య యాదవ్ బరిలో ఉండనున్నారు. మరికొన్ని సీట్లపై త్వరలోనే కీలక నిర్ణయాన్ని టీటీడీపీ తీసుకోనున్నది.