బీజేపీ ఆఫీస్‌లో బిజేవైఎం నేతలు ఘర్షణ పడ్డారు. బిజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వీ సూర్యకు వ్యతిరేకంగా బిజేవైఎం రాష్ట్ర కార్యకర్తల నినాదాలు చేశారు. ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలోనే యువమోర్చా నేతలు గొడవ పడ్డారు. రాడిసన్ హోటల్లో తేజస్వీ సూర్యకు వసతి ఏర్పాటుచేస్తే.. ఆయన ఎక్కడికి వెళ్లారని బిజేవైఎం కార్యకర్తలు ప్రశ్నించారు. సమాధానం చెప్పాలంటూ సూర్యను బిజేవైఎం కార్యకర్తలు నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తేజస్వీ సూర్యపై అసంతృప్తితో బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సమావేశానికి రాలేదు. తేజస్వీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా..ఇలానే వ్యవహరిస్తున్నారని బిజేవైఎం రాష్ట్ర కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. యువమోర్చా కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.