EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎన్నికలలో ఫ్లైయింగ్‌ స్కాడ్‌ బృందాల పాత్ర కీలకం

ఎన్నికలలో ఫ్లైయింగ్‌ స్కాడ్‌(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్‌ సర్వేలెన్స్‌(ఎస్‌ఎస్‌టీఎస్‌) బృందాల పాత్ర కీలకమని హైదరాబాద్‌ ఇన్‌చార్జి సీపీ, అదనపు పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ అన్నారు. శుక్రవారం జోనల్‌ డీసీపీలు, సిటీ పోలీస్‌ ఎలక్షన్‌ సెల్‌ డీసీపీలు, నోడల్‌ ఏసీపీలు, ఇన్‌చార్జీలు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలకు ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎస్‌పీఏ, అదనపు ఎస్పీ వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.ఈ సందర్భంగా విక్రమ్‌ సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, స్పెషల్‌ టీమ్‌ల పాత్ర ఎలా ఉంటుందనే విషయాలపై వివరించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఈ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు(టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950)కు ఫోన్‌ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top