EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కర్ణాటక నుంచి తెలంగాణకు భారీగా నగదును తరలించే యత్నం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి భారీగా నగదును తరలించే యత్నాన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.42 కోట్ల నగదును సీజ్‌ చేశారు. ఓ లారీలో 22 బాక్సుల్లో రూ.42 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అంతేగాక ఇంతకుముందే మరో రూ.8 కోట్లను కర్ణాటక నుంచి తెలంగాణకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.భారీగా నగదును సీజ్‌ చేసిన అనంతరం ఐటీ అధికారులు ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. కాగా బెంగళూరు నుంచి బైరే సంద్రకు లారీలో నగదును తరలించి, అక్కడి నుంచి ఏడు కార్లలో తెలంగాణకు తరలించాలని నిందితులు ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. అంతేగాక బెంగళూరులో మరో 5 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.కాంట్రాక్టర్‌ అంబికాపతి ఇల్లు, గెస్ట్‌హౌస్‌, ఆఫీస్‌లలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలోని ఓ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top