ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలపై దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సకల శాఖ మంత్రి మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒళ్లు బలిసి, కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఎవరు బలుపుతో మాట్లాడినా అంతరంగం జగన్మోహన్‌రెడ్డిదే.టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం “లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్” ఐటీ ప్రొఫెషనల్ చేస్తుంటే వారిని అడ్డుకోవడం దారుణం, దుర్మార్గం ఈ చర్యలను నేను ఖండిస్తున్నాను. ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబునాయుడు దగ్గర మంత్రిగా పనిచేసిన వారే. ఖండాంతరాల్లో చాలా దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బావ కళ్ళల్లో ఆనందం చూసిన మొద్దు శీనుకు ఏం గతి పట్టింది చూశాం. బాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి గుణపాఠం చెబుతారు. సీఎం జగన్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా చంద్రబాబు వైపే చూస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న విషయం జనానికి కూడా అర్థమైంది’’ అని దేవినేని ఉమా పేర్కొన్నారు.