EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎన్నికల శంఖారావం పూరించిన సిఎం కెసిఆర్

అప్పుడే దళితబంధు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు పేదరికం ఎందుకు ఉండేది?

 

కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నారు.. కానీ 10 ఛాన్స్‌లు ఇచ్చిండ్రు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలగబెట్టిండ్రు కదా! దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. దళితులు పేదరికంలో మగ్గుతున్నరంటే.. 75 సంవత్సరాల స్వతంత్య్రం తర్వాత ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. 60, 70 ఏండ్ల కింద దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదనేది ఆలోచించుకోవాలి. ఈ విధానలోపం ఎవరిది? ఇవాళ ఎవరైతే ఒక్క ఛాన్స్‌ అడుగుతున్నరో.. వాళ్లకు 10, 12 ఛాన్స్‌లు ఇచ్చిండ్రు.. వాళ్లేం చేయలేదు.

 

తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఏంది

 

తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఏంది? ఏవిధంగా ఉండే? ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి.. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు.. కొత్త కుండలో ఈగ సొచ్చినట్టు.. కొత్త సంసారం.. ఎక్కడ మొదలుపెట్టాలి.. ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఏవిధంగా పైకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఉన్న యావత్‌ ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ మీదనే బాధ్యత పెట్టిండ్రు కాబట్టి చాలా బాధ్యతగా.. ఆర్థిక నిపుణులను అందర్నీ రప్పించి.. రెండు మూడు నెలల పాటు మేదోమదనం చేసినం. మెదడు కరగదీసినం

 

ఓటు వేసేముందు ఆలోచించండి : సీఎం కేసీఆర్‌

 

సభలో చెప్పే మాటలు ఇక్కడే విడిచిపెట్టి పోవద్దు.. మీ బస్తీకో.. పట్టణానికో తండాకో వెళ్లిన తర్వాత కేసీఆర్‌ చెప్పినదాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి… పోతాయి. కానీ ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు.. రవుతు ఏదో.. రత్నమేదో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ఎవరో చెప్పిండ్రు అని అలవోకగా ఓటేయొద్దు.. ఓటు మన తలరాతను మారుస్తది.. మన తాలూకా.. జిల్లా.. రాష్ట్ర భవిష్యత్తును మారుస్తది. ఇది చాలా ఇంపార్టెంట్‌ కాబట్టి.. మా బామ్మర్ది.. మా మేనమామ చెప్పిండు అనే పద్దతిలో ఓట్లు వేయొద్దు.. అది బంద్‌ కావాలి.. ఆలోచించి.. స్పష్టమైన విధానంతో ఓటింగ్‌ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తరు.

Related News

Select the Topic
Scroll to Top