సీఎం జగన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులంటే లెక్క లేదా! విశాఖను పరిపాలన రాజధానిగా డిసెంబర్ నుంచి పాలన ప్రారంభిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విచారకరం. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా సీఎం జగన్ బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత నివాసం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చుగాని రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదు.’’ అని రామకృష్ణ వ్యాఖ్యానించారు