హుజూ రాబాద్తో పాటుగా గజ్వేల్లో కూడా పోటీ చేస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రజాబీష్టాం మేరకు నేను పోటీలో నిలుస్తున్నాను. కేసీఆర్ను గజ్వేల్ నుంచి ఓడిస్తాను. నన్ను ఓడించడానికి కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలను తరలించారు. గజ్వేల్లో నాకు సహకరించేందుకు వందలాది మంది నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నేతలకు మంత్రి హరీష్రావు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు’’ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.