హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛైర్మన్ గా కొడాలి భక్తపాల్ నియమితులయ్యారు.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ సమావేశం సికింద్రాబాద్ లోని హెచ్ఆర్సి కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ (విమెన్ ఫ్రంట్) షీబా, సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ఆర్సి ఆర్.ఎస్.జే. థామస్ లు ఆంధ్రరాష్ట్ర హెచ్ఆర్సి నూతన కమిటీని ఎన్నిక చేశారు.
కమిటీలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛైర్మన్ గా కొడాలి భక్తపాల్ను ప్రకటించి నియామక పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు.
హెచ్ఆర్సీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షునిగా దిడ్ల కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీగా జాకబ్ కుమార్ పశుమర్తిని నియమించినట్లు ప్రతినిధులు తెలియజేశారు.
హెచ్ఆర్సీ ఏపీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కొడాలి భక్తపాల్ ను ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేశారు.















