బతుకమ్మ పండుగ సందర్భంగా ఖమ్మం లో జెమిని టివి సీరియల్స్ తారల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ తొమ్మిది రోజులు జెమిని టివి సీరియల్స్ తారలు తెలంగాణలో పలు ప్రాంతాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొనబోతున్నారు.ఖమ్మం రామచంద్రుల గురవయ్య బ్రాహ్మణ సత్రంశ్రీ శృంగేరి శంకర మఠం ట్రంక్ రోడ్లో జరిగే బతుకమ్మ సంబరాలలో ఒంటరి గులాబి సీరియల్ తారలు అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న సరికొత్త సీరియల్ కొత్తగా రెక్కలొచ్చెనే తారలు పాల్గొనిఖమ్మం లో బతుకమ్మ సంబరాల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసారు.ఈ సంబరాలలో తారల ఆట పాటలతో పాటు, ఆటలలో గెలిచిన వారికి చీరలను బహుమతిగా ఇచ్చారు.