ఈతరం భారతం
సోషల్ మీడియా :
సోషల్ మీడియాపై ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. అంతమాత్రాన దానితో పిల్లలు చెడిపోతున్నారు అనే భావన స్థిరీకరించుకోవడం అంత మంచిది కాదు. సినిమాల్లో, టీవీ సీరియల్ లో మంచిని ప్రోత్సహించే,మనసులను పక్కదారి పట్టించే అంశాలు ఉన్నట్లే సోషల్ మీడియాలో ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్స్ లో మంచి కంటెంట్ ఇచ్చే ఛానల్స్ ఉన్నాయి. చూడ కూడనవి కూడా ఉన్నాయి . రిస్క్ తీసుకొని మంచి చానల్స్ రూపొందిస్తున్న వీడియోలు మంచి ప్రభావాన్ని చూపుతాయి. అలాంటి వాటిలో ఒకటి “జీవితమంటే ఇదేగా “యూట్యూబ్ ఛానల్. మనసును హత్తుకుని మైమరపించే ఎన్నో సన్నివేశాలు ఈ చానల్లో చూడవచ్చు. ఎక్కడ అసభ్యానికి తావు లేకుండా ఎంతో జాగ్రత్తగా నడుపుతున్న ఈ చానల్ ను ఈతరం భారతం బెస్ట్ తెలుగు ఛానల్ గా గుర్తించి అభినందిస్తోంది. ఈ ఛానల్ ను మీరూచూడండి. హాయిగా నవ్వుకోండి….















