EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నల్లు ఇంద్రసేనారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సాయిబాబా

త్రిపుర గవర్నర్ గా నూతన నియమించబడిన నల్లు ఇంద్రసేనారెడ్డిని తెలుగు రాష్ట్రాల యువ నాయకుడు కె. సాయిబాబా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించిన ఎన్‌.ఇంద్రసేనారెడ్డి విద్యార్థి దశ నుండి రాజకీయాల పట్ల ఆశక్తితో 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల గుండెలో నిలిచారని తెలియచేసారు. ఆయన బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర అద్యక్షుడు గా వివిధ హోదాల్లో పని చేసి బి‌జే‌పి పార్టీకి గట్టి పునాది చేకూర్చరని అన్నారు. సమన్వయ కమిటీ చైర్మన్‌గా జనవరి 2022లో నియమితుడయ్యాడు. త్రిపుర రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన గవర్నర్ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి రూపంలో దొరికాదని తెలుగు రాష్ట్రాల యువ నాయకుడు కె. సాయిబాబా హర్షం వ్యక్తం చేశారు. నల్లు ఇంద్రసేనారెడ్డిని అక్టోబర్ 18న త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్నతలు తెలియచేసారు. 

 

Related News

Select the Topic
Scroll to Top