EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విపక్షాలు కలలో కూడా కేసీఆర్ ను అందుకోలేరు

విపక్షాలు కలలో కూడా కేసీఆర్ ను అందుకోలేరని మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.శుక్రవారం మక్తల్ నియోజకవర్గం “ఆత్మకూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమవేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంఎల్ఏ చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో కలిసి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ,మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సమావేశం లో ఆత్మకూర్ మండల ముఖ్య నాయకులు,అన్ని గ్రామాల పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. విపక్షాల వెర్రితనానికి వోట్లు పడతాయా.అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో నీటి సిరులు..పక్కనే కర్ణాటకలో కన్నీటి వరదలు మక్తల్ కరెంట్ వెలుగులు.. కర్ణాటక లో కటిక చీకట్లు తెలంగాణ లో సంక్షేమం.. పక్కన కర్ణాటక లో సంక్షోభం,మక్తల్ నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ వైపే నని చిట్టెం రామ్మోహన్ రెడ్డిభారీ మెజారిటీ ఖాయమన్నారు.

 

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ఫెస్టివల్ మూడ్ లో గ్రామాలు

 

అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతు సంక్షేమ పథకాల అమలులో.. దేశంలోనే అగ్రస్థానం తెలంగాణనూతన మ్యానిఫెస్టోతో.. ఇంకా ఎక్కువ సంక్షేమం ప్రజలంతా కెసిఆర్ నాయకత్వం లో.. బిఆర్ఎస్ వైపు ఉన్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే సతీమణి సుచరిత,,మున్సిపల్ చైర్మన్ గాయత్రి యాదవ్,ఆత్మకూరు మండల అధ్యక్షులు రవి కుమార్ యాదవ్,ఎంపీపీ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు జానకి రామ్ గారు ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, పెద్ద ఎత్తున సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ ప్రజాప్రతినిధులు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top